లాక్‌డౌన్‌.. విమాన, రైల్వే సర్వీసులపై క్లారిటీ | All Domestic And International Flights Suspended Till 3rd May In India | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌.. విమాన, రైల్వే సర్వీసులపై క్లారిటీ

Apr 14 2020 1:10 PM | Updated on Apr 14 2020 2:22 PM

All Domestic And International Flights Suspended Till 3rd May In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విమాన సర్వీసులకు సంబంధించి కేంద్ర పౌరవిమానయానశాఖ స్పష్టతనిచ్చింది. అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను మే 3వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. కాగా, మార్చి 24న మోదీ లాక్‌డౌన్‌ ప్రకటన చేయడానికి ముందే అంతర్జాతీయ సర్వీసులపై భారత్‌ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే దేశీయ విమాన సర్వీసులను కూడా నిలిపివేశారు. మరోవైపు విమానయాన రంగంపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావడంతో ఇప్పటికే చాలా విమానయాన సంస్థలు తమ స్బిబందికి జీతాలు చెల్లించకుండా సెలవులు తీసుకోవాలని కోరుతున్నాయి. అయితే గతవారం కొన్ని విమాన సర్వీసులను పునరుద్దరించాలని చర్చలు జరిపినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల కారణంగా అందుకు ఆమోదం లభించలేదు.

మే 3 వరకు అన్ని రైళ్లు రద్దు..
ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ను పొడిగిస్తు ప్రకటించడంతో రైల్వేశాఖ కూడా మే 3వ తేదీ అర్ధరాత్రి వరకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ట్విటర్‌లో ఒక ప్రకటన చేసింది. అయితే గూడ్స్‌ సర్వీసులు యథావిథంగా కొనసాగనున్నాయి.

చదవండి : మే 3 వరకు లాక్‌డౌన్‌ : మోదీ

Advertisement
 
Advertisement
Advertisement