విమానం ఇంజన్‌లో ఇరుక్కుని ఉద్యోగి మృతి | Air India Technician Sucked Into Aircraft Engine At Mumbai Airport, Dies | Sakshi
Sakshi News home page

విమానం ఇంజన్‌లో ఇరుక్కుని ఉద్యోగి మృతి

Dec 17 2015 8:11 AM | Updated on Sep 3 2017 2:09 PM

విమానం ఇంజన్‌లో ఇరుక్కుని ఉద్యోగి మృతి

విమానం ఇంజన్‌లో ఇరుక్కుని ఉద్యోగి మృతి

పార్కింగ్ చేసి ఉన్న విమానం ఇంజన్‌లో ఇరుక్కుని ఎయిరిండియా గ్రౌండ్ క్రూ సభ్యుడు ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

పార్కింగ్ చేసి ఉన్న విమానం ఇంజన్‌లో ఇరుక్కుని ఎయిరిండియా గ్రౌండ్ క్రూ సభ్యుడు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన ముంబై విమానాశ్రయంలో జరిగింది. ముంబై నుంచి విమానం హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంది. విమానం కో-పైలట్ ఒక సిగ్నల్‌ను తప్పుగా అర్థం చేసుకుని ఇంజన్ స్టార్ట్ చేయడంతో అప్పటికి దాని వద్ద ఉన్న రవి సుబ్రమణియన్ అనే ఉద్యోగిని ఇంజన్‌ ఫ్యాన్లు లోపలకు లాగేశాయి. లోపల ఇరుక్కుపోయిన రవి.. అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన ఛత్రపతి శివాజీ డొమెస్టిక్ ఎయిర్‌పోర్టులోని 28వ బే వద్ద జరిగింది. విమాన సిబ్బంది సాధారణంగా విమానం ఇంజన్లు ఆఫ్ చేసి ఉన్నప్పుడే వాటి నిర్వహణ పనులు చూస్తుంటారు.

ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఎయిరిండియా సీఎండీ అశ్వనీ లోహానీ ఓ ప్రకటనలో తెలిపారు. ముంబై విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన పట్ల తాము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని, మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియస్తున్నామని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement