టిఫిన్‌బాక్స్‌ గొడవతో విమానం ఆలస్యం | Air India flight delayed after spat over pilot lunch box | Sakshi
Sakshi News home page

టిఫిన్‌బాక్స్‌ గొడవతో విమానం ఆలస్యం

Jun 20 2019 4:26 AM | Updated on Jun 20 2019 4:26 AM

Air India flight delayed after spat over pilot lunch box - Sakshi

యశవంతపుర: టిఫిన్‌ బాక్స్‌ను శుభ్రం చేయడంపై విమానం పైలట్, క్యాబిన్‌ క్రూ సిబ్బందికి మధ్య జరిగిన గొడవ కారణంగా ఎయిరిండియా విమానం రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. సోమవారం బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన ఏఐ–772 విమానంలో ఈ ఘటన జరిగింది. ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఎయిరిండియా  విచారణకు రావాల్సిందిగా పైలట్, సిబ్బందిని ఆదేశించింది. మొదట తెచ్చిన లంచ్‌ చల్లబడటం వల్ల దీనిని వేడి చేసి ఇవ్వాలని కెప్టెన్‌ విమానంలోని ఓ పురుష అటెండెంట్‌కు సూచించారు. సిబ్బంది అలాగేనని వేడి చేసి తెచ్చిచ్చారు. లంచ్‌ ఆరగించిన కెప్టెన్, ఖాళీ బాక్స్‌ను శుభ్రం చేసి ఇవ్వాలని ఓ సిబ్బందిని కోరారు. పదేపదే పనులు పురమాయిస్తున్నారంటూ సిబ్బంది కెప్టెన్‌తో ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. కెప్టెన్‌ అసలు పనిని వదిలేసి గొడవలో మునిగిపోవడంతో విమానం రెండు గంటలు నేలమీదనే ఉండిపోయింది. 

Advertisement
 
Advertisement
Advertisement