ఆధార్‌కు వయసు ధ్రువీకరణ తప్పనిసరి కాదు | Age certification is not mandatory for aadhar | Sakshi
Sakshi News home page

ఆధార్‌కు వయసు ధ్రువీకరణ తప్పనిసరి కాదు

May 25 2017 1:21 AM | Updated on May 25 2018 6:12 PM

ఆధార్‌ కార్డు దరఖాస్తు సమయంలో వయసు ధ్రువీకరణ పత్రం తప్పనిసరేమీ కాదని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) తెలిపింది.

న్యూఢిల్లీ: ఆధార్‌ కార్డు దరఖాస్తు సమయంలో వయసు ధ్రువీకరణ పత్రం తప్పనిసరేమీ కాదని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) తెలిపింది.

మనదేశంలో చాలామందికి పుట్టినరోజు, సంవత్సరం తెలియదని.. అలాంటి సందర్భంలో తమ నిబంధనలకు అనుగుణంగా వివరాలు అందించాలని యూఐడీఏఐ ఉన్నతాధికారి తెలిపారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని కంజసా గ్రామంలో ప్రతి ఐదుగురిలో ఒకరి పుట్టినరోజు జనవరి 1న ఉండడంపై ఆయన స్పందించారు. దరఖాస్తుదారు అందించిన వివరాల ఆధారంగానే ఆధార్‌కార్డులు జారీచేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement