సబ్సిడీ సిలిండర్లపై మళ్లీ పరిమితి! | again Limit subsidized cylinders | Sakshi
Sakshi News home page

సబ్సిడీ సిలిండర్లపై మళ్లీ పరిమితి!

Jul 11 2014 1:18 AM | Updated on Mar 29 2019 9:04 PM

సబ్సిడీ సిలిండర్లపై మళ్లీ పరిమితి! - Sakshi

సబ్సిడీ సిలిండర్లపై మళ్లీ పరిమితి!

మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు సబ్సిడీల భారాన్ని క్రమంగా దించుకునే దిశగా బడ్జెట్‌లో పలు ప్రతిపాదనలు చేసింది. ముఖ్యంగా డీజిల్, వంటగ్యాస్ సబ్సిడీల వల్ల ఏటా పడుతున్న రూ.1.40 లక్షల కోట్ల భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది.

న్యూఢిల్లీ: మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు సబ్సిడీల భారాన్ని క్రమంగా దించుకునే దిశగా బడ్జెట్‌లో పలు ప్రతిపాదనలు చేసింది. ముఖ్యంగా డీజిల్, వంటగ్యాస్ సబ్సిడీల వల్ల ఏటా పడుతున్న రూ.1.40 లక్షల కోట్ల భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా డీజిల్ ధరపై నియంత్రణ పూర్తిగా ఎత్తివేయడంతోపాటు వంటగ్యాస్ సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను కుదించాలని నిర్ణయం తీసుకుంది. ‘‘డీజిల్ మార్కెట్ ధరకు, అమ్మకపు ధరకు మధ్యనున్న వ్యత్యాసాన్ని 2014-15 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా పూర్తిగా తొలగించాలని యోచిస్తున్నాం.

ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణ ఉండదు. మార్కెట్ రేట్ల ప్రకారమే వాటి అమ్మకపు ధర ఉంటుంది’’ అని బడ్జెట్‌లో పేర్కొన్నారు. మొత్తమ్మీద 2013-14లో ఇంధన సబ్సిడీ రూ.1.40 లక్షల కోట్లు ఉండగా, ఇందులో ఒక్క డీజిల్‌పైనే రూ.62,800 కోట్లు వెచ్చిస్తున్నారు. ‘‘చమురు రంగంలో అంతర్జాతీయంగా ఎలాంటి షాకులూ లేకపోతే ఏడాదిలోగా డీజిల్ ధరలపై నియంత్ర ణ తొలగిపోతుంది. సబ్సిడీ పెరిగిపోతున్న నేపథ్యంలో సిలిండర్ల సంఖ్యపై వా స్తవ అంచనాతో పరిమితి విధించాల్సిన అవసరముంది’’ అని పేర్కొన్నారు.    
 

Advertisement
 
Advertisement
Advertisement