వివాదం రేపుతున్న కరీనా మార్ఫింగ్‌ ఫొటో | Actress Kareena Kapoor Khan’s photo morphed | Sakshi
Sakshi News home page

వివాదం రేపుతున్న కరీనా మార్ఫింగ్‌ ఫొటో

Nov 19 2017 2:16 PM | Updated on Nov 19 2017 2:22 PM

Actress Kareena Kapoor Khan’s photo morphed - Sakshi - Sakshi

సాక్షి, జైపూర్‌ : రాజస్థాన్‌లో లవ్‌ జిహాద్‌కు వ్యతిరేకంగా హిందు స్పిర్చువాలిటీ అండ్‌ సర్వీస్‌ ఫౌండేషన్‌ (హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌) అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎస్‌ఎప్‌ఎఫ్‌ విడుదల చేసిన కరీనా కపూర్‌ ఖాన్‌ ఫొటో అత్యంత వివాదాస్పదంగా మారింది. కరీనా ఫొటోను, బుర్ఖా వేసుకున్న మరో మహిళ ఫొటోతో మార్ఫింగ్‌ చేసి.. లవ్‌ జిహాద్‌ వలలో చిక్కుకుంటే.. మీరు ఇలా అవుతారంటూ విద్యార్థులకు హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు బోధిస్తున్నారు.

ఈ కరపత్రాన్ని హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ బహిరంగ ప్రదేశాల్లో పంపిణీ చేస్తోంది. ముస్లిం, క్రైస్తవ మతాలు చేస్తున్న మతమార్పిడి మోసాలను విద్యార్థులకు తెలియచెప్పేందుకే ఇలా చేస్తున్నట్లు సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ విద్యార్థుల్లో ఆధ్యాత్మిక పెంపెందించే కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఈ అవగాహన కార్యక్రమాల్లో రాజస్థాన్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులంతా హాజరు కావాలని అక్కడి రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ అవగాహనా కార్యక్రమాల్లో హిందూ జీవన విధానాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ బోధించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement