breaking news
Morphed
-
డీప్ ఫేక్ బారిన రష్మిక, కత్రినా..రక్షణ కోసం ఏం చేయాలంటే..!
టాలీవుడ్ నటి రష్మిక మందన్న, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఢీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సాంకేతికతో వస్తున్న విప్లవాత్మక మార్పులు అందిపుచ్చుకుని కొందరూ ఈ దురాగతాలకు పాల్పడుతున్నారు. ప్రముఖుల, సెలబ్రెటీలనే గాక సాధారణ మహిళలు సైతం బాధితులుగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో 37% ఈ ఫోటో లేదా వీడియో మార్ఫింగ్ ఫేక్ కేసులే అధికంగా వస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. బాధితుల పరువు ప్రతిష్ట దిగజార్చి వారిని నానారకాలుగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్న ఉదంతాలెన్నో తెర మీదకు వస్తున్నాయి. తెలిసో తెలియక ఇలా మీ ఫోటోలు లేదా వీడియోలు మార్ఫింగ్ బారిన పడినట్లయితే వెంటనే ఏం చేయాలి? ఈ సమస్యను నుంచి సునాయాసంగా ఎలా బయటపడాలి తదితరాల గురించే ఈ కథనం!. మార్ఫింగ్ అంటే.. మీ వ్యక్తిగత ఫోటోలు లేదా వీడియోలు కొందరూ మార్ఫింగ్ టెక్నాలజీని ఉపయోగించి అశ్లీలంగా లేదా అభ్యంతరకరంగా మార్చి సోషల్ మీడియాలో వదులుతుంటారు. దీంతో ఒక్కసారిగా మీ వ్యక్తిగత పరువు, గౌరవం కోల్పోయినవాళ్లుగా మిగిలిపోతాం. ఇలాంటప్పుడూ తెలియకుండానే మన మానసిక స్థితి బలహీనమవుతుంది. దీన్నే ఆసరాగా తీసుకుని మీ నుంచి లబ్ధి పొందే కుట్రకు తెగబడుతుంటారు ఆన్లైన్ నేరగాళ్లు. నిజానికి ఏ వ్యక్తి అయినా ఈ స్థితిలో మానసికంగా నిలువునా కూలబడిపోతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అన్ని బాగున్నప్పుడే ధైర్యంగా ఉండటం వేరు. పరిస్థితి దారుణంగా ఉన్నప్పుడూ తట్టుకుని నిలబడేవాడు నిజమైన ధైర్యవంతుడు అని గుర్తించుకోండి. ఇక్కడ మీకు కావల్సింది మానసిక స్థితిని స్ట్రాంగ్ ఉండేలా చేసుకోవడమే మీ మొట్టమొదటి తక్షణ కర్తవ్యం. ఆ తర్వాత మీ బాధని, ఆవేదనని అర్థం చేసుకునేవాళ్లు లేదా మిమ్మల్ని సపోర్ట్ చేసి, సాయం చేస్తారనుకునేవాళ్లకు అసలు విషయాన్ని చెప్పాలి. కనీసం మీకు అలా సాయం చేసేవాళ్లు లేకపోతే సైబర్‌క్రైం, షీ టీం వంటి విమెన్ సంరక్షణ కోసం వస్తున్న పోలీసు విభాగాలను ఆశ్రయించి ఈ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. డీప్ ఫేక్ వీడియోలు ఎలా గుర్తించొచ్చంటే.. డీప్ ఫేక్ వీడియోలను గుర్తించొచ్చు. ఎందుకంటే మన వాళ్లు లేక మనమో దీనికి గురైతే పరిస్థితిని వివరించడానికి ఇది ఉపకరిస్తుంది. ఎప్పుడైనా ఇలా ఏఐ సాంకేతతో డీప్ ఫేక్ వీడియోలు చేసినట్లయితే..ఆ వీడియోలను నిశితంగా గమనిస్తే వాటి ఆడియో సీన్లో వ్యక్తి ముఖకవళికలను గమనించాలి. ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్ సౌండ్స్‌ని గమనించినా అర్థమైపోతుంది అది ఫేక్ అని. అలాగే విజువల్స్ కూడా క్లారిటీగా ఉండవు. ఇలా ఫోటోలు, వీడియోలు మార్చే సాంకేతిక తోపాటు అలాంటి వాటిని గుర్తించే టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందింది. అలాంటి డీప్ ఫేక్ వీడియోలు లేదా ఫోటోలు గుర్తించే టూల్స్ ఏంటంటే.. సెంటినెల్ ఇంటెల్ రియల్-టైమ్ డీప్‌ఫేక్ డిటెక్టర్ WeVerify (వీ వెరీఫై) మైక్రోసాఫ్ట్ వీడియో ప్రమాణీకరణ సాధనం Phoneme-Viseme టూల్ తక్షణమే చేయాల్సిన మరోపని ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయని సాయం చేసేలా కొన్ని హెల్ప్లైన్ల అందుబాటులో పెట్టారు. అలాగే ముఖ్యంగా 18 ఏళ్ల నిండని చిన్నారుల సైతం బాధితులవ్వకూడదననే ఉద్దేశ్యంతో కొన్ని ఆన్లైన్ చారిటీ సంస్థలు సాంకేతికతో కూడిన ప్రముఖ టూల్స్‌ని కూడా తీసుకొచ్చాయి. నేరుగా పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి కంప్లైయింట్ ఇవ్వడానికి భయపడే బాధితుల కోసమే ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ముందుగా హెల్ప్‌లైన్ నెంబర్ 1902కి కాల్ చేసి మీ ఫోటో లేదా వీడియోలు మార్ఫింగ్ అయినా వాటి గురించి పూర్తి వివరాలను తెలియజేయాలి. ఆ తర్వాత వెబసైట్ లింక్‌లో https://stopncii.org/ మీ ఒరిజన్‌ల ఫోటో తోపాటు మార్ఫింగ్‌కి గురైన ఫోటోను అప్లోడ్ చేయాలి. అంతే మీ ఫోటో ఇంటర్నెట్లో ఎక్కడ ఉన్నా వెంటనే డిలీట్ అయిపోతుంది. ఈ వెబ్సైట్ మీ గోప్యతను కాపాడుతుంది. బాధితులకు మద్దతుగా ఉండేందుకు రూపొందించిన వెబ్సైట్ ఇది. ఇది 2000లో ప్రారంభమైంది. ఆన్లైన్లో బాధితులుగా ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య వాటాదారులతో కలిసి పనిచేస్తుంది. వ్యక్తిగత డేటాను ఆన్లైన్లో షేర్ చేసేటప్పుడూ.. సోషల్ మీడియా ఖాతాలలో మీ డేటాను గోప్యంగా ఉంచండి మీ వ్యక్తిగత చిత్రాలను ఆన్లైన్లో పబ్లిక్‌గా ఎప్పుడూ షేర్ చేయవద్దు చిత్రాలను పంచుకునేటప్పుడు వాటర్‌మార్క్ ఉపయోగించండి మీ సోషల్ మీడియా ఖాతాల స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లతో రెండు కారకాల ప్రమాణీకరణను ఉపయోగించండి. అనుకోని సంఘటన ఎదురైతే తెలియజేసేలా అందుకు సంబంధించిన సాక్ష్యం, స్క్రీన్ షాట్లను సేవ్ చేయండి. బాధితులు తీసుకోవాల్సిన చర్యలు సమీప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదున నమోదు చేయండి cybercrime.gov.inలో మీ వివరాలు చెప్పకుండా కూడా ఆన్లైన్ ఫిర్యాదును నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే సోషల్ మీడియా ఖాతా సహాయ కేంద్రానికి నివేదించండి ఈ నేరానికి సంబంధించిన చట్టాలు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 66,37 వంటి కేసులు పెట్టోచ్చు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసినందుకు, చీటింగ్ చేసినందుకు సెక్షన్ 354(డీ), 465, 463 వంటి కేసులు పెట్టొచ్చు బాధితులు చిన్న పిల్లలైతే చైల్డ్ ఫోర్నోగ్రఫీకి సంబంధించిన సెక్షన్ 14, 15 వంటి బలమైన కేసులు పెట్టొచ్చు. వీటికి జైలు శిక్ష, భారీ మొత్తంలో జరిమాన విధించడం జరుగుతుంది. (చదవండి: ఆర్ట్ సైంటిస్ట్! ఆర్ట్, సైన్సును కలిపే సరికొత్త కళ!) -
రష్మిక వీడియోలానే మరో స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కానీ ఆ వీడియో భారత సంతతికి చెందిన అమ్మాయి జరా పటేల్‌గా గుర్తించారు. గత నెల ఆమె తన ఇన్‌స్టాలో ఈ వీడియోను షేర్ చేసింది. అయితే కొందరు దుండగులు డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో రష్మిక ఫేస్ వచ్చేలా చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే ఈ వీడియోను అగ్రనటులు సైతం ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అమితాబ్ బచ్చన్ డిమాండ్ చేశారు. ఇది చూశాక చాలా భాదపడ్డానని రష్మిక ట్వీట్ చేసింది. అయితే తాజాగా మరో స్టార్ హీరోయిన్‌కు సంబంధించిన డీప్ ఫేక్ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. ప్రస్తుతం టైగర్-3 చిత్రంలో బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ఓ సీన్లో వచ్చే కత్రినా ఫోటోను డీప్ ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కత్రినా కైఫ్.. మరో హాలీవుడ్ మిచెల్ లీతో టవల్ ఫైట్ సీన్లో కనిపించింది. ఈ సీన్ సినీ ప్రేక్షకుల దృష్టిని విపరీతంగా ఆకట్టుకంది. అయితే తాజాగా ఈ ఫైట్ సీన్లోని కత్రినా ఫోటోను ఏఐ సాయంతో మార్ఫింగ్ చేసినట్లు కనిపిస్తోంది. రెండు రోజుల్లోనే ఇద్దరు స్టార్ హీరోయిన్లపై ఇలాంటి సంఘటనలు జరగడం ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారి తీసింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సినీతారలు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. -
వీబీఐటీ కాలేజీలో విద్యార్థినిల ఫోటోలు మార్ఫింగ్ కలకలం
-
వివాదం రేపుతున్న కరీనా మార్ఫింగ్ ఫొటో
సాక్షి, జైపూర్ : రాజస్థాన్‌లో లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా హిందు స్పిర్చువాలిటీ అండ్ సర్వీస్ ఫౌండేషన్ (హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్) అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో హెచ్ఎస్ఎప్ఎఫ్ విడుదల చేసిన కరీనా కపూర్ ఖాన్ ఫొటో అత్యంత వివాదాస్పదంగా మారింది. కరీనా ఫొటోను, బుర్ఖా వేసుకున్న మరో మహిళ ఫొటోతో మార్ఫింగ్ చేసి.. లవ్ జిహాద్ వలలో చిక్కుకుంటే.. మీరు ఇలా అవుతారంటూ విద్యార్థులకు హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు బోధిస్తున్నారు. ఈ కరపత్రాన్ని హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్ బహిరంగ ప్రదేశాల్లో పంపిణీ చేస్తోంది. ముస్లిం, క్రైస్తవ మతాలు చేస్తున్న మతమార్పిడి మోసాలను విద్యార్థులకు తెలియచెప్పేందుకే ఇలా చేస్తున్నట్లు సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్ విద్యార్థుల్లో ఆధ్యాత్మిక పెంపెందించే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ అవగాహన కార్యక్రమాల్లో రాజస్థాన్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులంతా హాజరు కావాలని అక్కడి రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ అవగాహనా కార్యక్రమాల్లో హిందూ జీవన విధానాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్ బోధించనుంది. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ ఫొటో మార్ఫింగ్, ఇద్దరి అరెస్ట్
కార్గాన్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఫోటోను మార్ఫింగ్ చేసిన ఘటనలో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మోహన్ భగవత్ ఫోటోను అభ్యంతరకంగా మార్పులు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం, ఆ ఫోటో సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేయడం మధ్యప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. 22 ఏళ్ళ షాఖిర్, 20 ఏళ్ళ వసీమ్ అనే యువకులు మోహన్ భగవత్ చిత్రాన్ని మార్ఫింగ్ చేసి భికన్ గోన్ పట్టణంలోని స్థానిక సోషల్ నెట్ వర్కింగ్ గ్రూప్‌లో పోస్టు చేశారు. కాగా ఆ ఫొటోను మార్చి 16న పోస్టు చేసినట్లు గుర్తించామని, వారిద్దరినీ అరెస్టు చేసినట్లు ఏఎస్పీ అంతర్ సింగ్ కనేష్ వెల్లడించారు. మరోవైపు మోహన్ భగత్ మార్ఫింగ్ ఫొటోపై ఆర్ఎస్ఎస్, బిజెపి కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరికీ వ్యతిరేకంగా ఐటీ చట్టం సెక్షన్ 67, భారత శిక్షాస్మృతి 505 (2) సెక్షన్లకింద భికాన్ గాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. కోర్టు వారిద్దర్ని ఈనెల 30 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే నిందితులు మాత్రం తమకు ఆ ఫొటో మరో గ్రూప్ నుంచి వచ్చిందని, కేవలం దాన్ని తాము పోస్టు చేసినట్లు చెప్తున్నారని ఏఎస్పీ పేర్కొన్నారు.