అకౌంటెంట్‌ పరీక్షలో అందరూ ఫెయిలే.. | Accountant Examination Results in all students fail | Sakshi
Sakshi News home page

అకౌంటెంట్‌ పరీక్షలో అందరూ ఫెయిలే..

Aug 23 2018 3:03 AM | Updated on Aug 23 2018 3:03 AM

Accountant Examination Results in all students fail - Sakshi

పణజి: ఏ పరీక్షలోనైన పాస్, ఫెయిల్‌ అనేవి సర్వ సాధారణం కానీ, ఈ పరీక్షలో మాత్రం అందరూ ఫెయిలే. ఈ ఘటన గోవాలో జరిగింది. బుధవారం అకౌంటెంట్‌ పరీక్ష ఫలితాలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన 8 వేల మంది అభ్యర్థులూ ఫెయిలయ్యారని పేర్కొంది. గోవా ప్రభుత్వం 80 అకౌంటెంట్‌ పోస్టుల భర్తీలో భాగంగా ఈ ఏడాది జనవరి 7న పరీక్ష నిర్వహి ంచింది. మొత్తం 100 మార్కుల పేపర్‌కు 5గంటల సమయం కేటాయించారు. దీంట్లో ఉత్తీర్ణత సాధించా లంటే కనీసం 50 మార్కులు రావాలి. ఏ ఒక్క అభ్య ర్థికీ 50 మార్కులు రాకపోవడం, వీరంతా గ్రాడ్యు యేట్‌ విద్యార్థులే కావడం గమనార్హం. గోవా యూని వర్సిటీ, కామర్స్‌ కాలేజీలు విద్యార్థులను ఇలా  చేయడం సిగ్గుచేటని శివసేన  దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement