
పారిశ్రామికవేత్తలకే ‘అచ్చాదిన్’: హజారే
ప్రధాని నరేంద్ర మోదీ రైతులు, పేదప్రజల్ని గాలికొదిలేసి పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు పరిరక్షించడానికి కంకణం క ట్టుకున్నారని ప్రముఖ సామాజిక వేత్త అన్నా హజారే విమర్శించారు.
రాలెగావ్ సిద్ధి: ప్రధాని నరేంద్ర మోదీ రైతులు, పేదప్రజల్ని గాలికొదిలేసి పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు పరిరక్షించడానికి కంకణం క ట్టుకున్నారని ప్రముఖ సామాజిక వేత్త అన్నా హజారే విమర్శించారు. తన స్వగ్రామం రాలెగావ్ సిద్దిలో మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రచారం చేసిన ‘మంచిరోజులు’ కేవలం పారిశ్రామికవేత్తలకే వచ్చాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశం అభివృద్ధి చెందదని వ్యాఖ్యానించారు. దేశ రాజధాని ఢిల్లీలో రైతు సంఘాలతో కలిసి భూసేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఈ నెల 23, 24 తేదీలలో హజారే నిర శన దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే.