48 గంటల్లో 8 కిలోల బంగారం స్వాధీనం | 8 kg of gold seized in 48 hours | Sakshi
Sakshi News home page

48 గంటల్లో 8 కిలోల బంగారం స్వాధీనం

Oct 28 2014 10:51 PM | Updated on Sep 2 2017 3:30 PM

48 గంటల్లో 8 కిలోల బంగారం స్వాధీనం

48 గంటల్లో 8 కిలోల బంగారం స్వాధీనం

అంతర్జాతీయ విమానాశ్రయంలో గడచిన 48 గంటల్లో ఆరుగురు ప్రయాణికుల..

సాక్షి, ముంబై: అంతర్జాతీయ విమానాశ్రయంలో గడచిన 48 గంటల్లో ఆరుగురు ప్రయాణికుల వద్ద నుంచి ఎనిమిది కిలోల బంగారాన్ని సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ. రూ.  2.14 కోట్ల రూపాయలు ఉంటుంది. సోమవారం ఓ స్మగ్లర్ 50 లక్షల రూపాయలు విలువ చేసే రెండు కిలోల బంగారాన్ని చెత్త బుట్టలో పడవేశాడు. దీనిని గమనించిన సీఐఎస్‌ఎఫ్ అధికారి సీజ్ చేశారు.

మరో ప్రయాణికుడు బూట్లలో బంగారాన్ని రహస్యంగా దాచుకుని వస్తుండగా పట్టుకున్నారు. మరో ప్రయాణికుడు గొడుగులో పెట్టుకుని వస్తుండగా పట్టుకున్నారు. సోమవారం అర్ధరాత్రి మహ్మద్ షరీఫ్, ఎ.ఎం.ఆర్.మహ్మద్ ఇబ్రహీం అనే ఇరువురు ప్రయాణికుల వద్ద నుంచి 5.9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారి ఒకరు వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement