ఢిల్లీ @ 47.8 | 62 years, the highest temperature | Sakshi
Sakshi News home page

ఢిల్లీ @ 47.8

Jun 9 2014 1:38 AM | Updated on Sep 2 2017 8:30 AM

ఢిల్లీ @ 47.8

ఢిల్లీ @ 47.8

దేశ రాజధాని ఢిల్లీ నగరవాసులు భానుడి ప్రతాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉష్ణతాపం, వేడిగాలులకు వణికిపోతున్నారు.

62 ఏళ్లలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత
 
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరవాసులు భానుడి ప్రతాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉష్ణతాపం, వేడిగాలులకు వణికిపోతున్నారు. ఢిల్లీలో ఆదివారం రికార్డు స్థాయిలో 47.8 డిగ్రీ సెల్షియస్‌ల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత 62 ఏళ్లలో ఢిల్లీలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే నని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.

ఎండవేడికి తరచూ కరెంటు కోతలూ తోడవుతుండటంతో ఢిల్లీవాసుల ఇక్కట్లు మరింత పెరుగుతున్నాయి. రాజధానితోపాటు ఉత్తరాది ప్రాంతాల ప్రజలూ ఉష్ణతాపానికి విలవిల్లాడుతున్నారు. ఢిల్లీలో సోమవారం కూడా ఇవే పరిస్థితులు కొనసాగుతాయని నమోదు కావచ్చని ఐఎండీ తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement