
పూణే : మహారాష్ట్రలోని ఓ పంటపొలాల్లో 5 చిరుత పులి పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. పూణేలోని జూనార్‌లో ఆలాసరి గ్రామంలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ చెరుకు తోటలో పంటకోయడానికి వచ్చిన కూలీలు 5 చిరుత పులి పిల్లల మృతదేహాలను గుర్తించారు. 'పొలంలోని చెత్తను ఒక్కచోటుకి తెచ్చి కాల్చమని యజమాని చెప్పారు. చెత్తను ఒక్క చోట తెచ్చి వేస్తుండగా అందులో ఐదు చిరుత పులి పిల్లల మృతదేహాలు ఉన్నట్టు ఓ మహిళా కూలి గుర్తించింది' అని పొలంలో పని చేయడానికి వచ్చిన వ్యక్తి చెప్పాడు.