మూడోసారి వారణాసికి ప్రధాని మోదీ | 40 Delegations, 90 Minutes For PM Narendra Modi's Power Visit to Varanasi | Sakshi
Sakshi News home page

మూడోసారి వారణాసికి ప్రధాని మోదీ

Sep 18 2015 10:50 AM | Updated on Aug 15 2018 2:20 PM

రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు ...

న్యూఢిల్లీ :  ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ట్రామా సెంటర్‌ను ప్రారంభించనున్న మోదీ విద్యుత్, రహదారుల రంగాలకు సంబంధించి కొత్త పథకాలను ఆరంభిస్తారు.


అనంతరం స్థానిక రిక్షా సంఘం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. ప్రధాని పదవిని చేపట్టిన  తర్వాత మోదీ వారణాసిలో పర్యటించడం ఇది మూడోసారి. సుమారు 90 నిమిషాల పాటు మోదీ వారణాసిలో పర్యటించనున్నారు. కాగా భారీ వర్షాల కారణంగా రెండుసార్లు వారణాసి పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement