క‌రోనా : ఆక్సిజ‌న్ థెర‌పీతో కోలుకున్న 396 మంది

396 People Recovered With Early Oxygen Therapy In Bhopal - Sakshi

భోపాల్ :  ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా వైర‌స్ క‌రాళ నృత్యం చేస్తుంది. భార‌త్‌లోనూ కోవిడ్ కేసుల సంఖ్య 60 వేల‌కు చేరువ‌లో ఉంది. ఈ మ‌హ‌మ్మారికి మందులేని కార‌ణంగా రోజోరోజుకు పెరుగుతున్న క‌రోనా కేసులతో ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారింది. నేప‌థ్యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని చిరాయి ఆసుప‌త్రిలో ఆక్సిజ‌న్ చికిత్స ద్వారా 396 మంది క‌రోనా రోగులు కోలుకొని డిశ్చార్జ్  అయ్యారు. శుక్ర‌వారం ఒక్క‌రోజే 18 మంది కోలుకున్నార‌ని చిరాయు హాస్పిట‌ల్ డైరెక్ట‌ర్ అజ‌య్ గొయెంకా ప్ర‌క‌టించారు. ఆక్సిజ‌న్ థెర‌పీ ద్వారా స‌త్ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌ని తెలిపారు.
(మందు కొంటే ‘మార్క్‌’ పడాల్సిందే! )

డిశ్చార్జ్ అయిన త‌ర్వాత 14 రోజుల పాటు ఇంట్లోనే స్వీయ నిర్భందంలోకి వెళ్లాల‌ని సూచించిన‌ట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అయ్యాక త‌మ ఫ్లాస్మాను దానం చేయాల్సిందిగా కోరిన‌ట్లు వెల్ల‌డించారు. అంతేకాకుండా భోపాల్ ఎయిమ్స్ నుంచి 2 క‌రోనా రోగులు కూడా ఆక్సిజ‌న్ థెర‌పీ అందించ‌డం వ‌ల్ల కోలుకున్నార‌ని ఎయిమ్స్ డైరెక్ట‌ర్ శ‌ర్మాన్ తెలిపారు. ఆక్సిజ‌న్ థెర‌పీ క‌రోనా రోగుల‌పై మంచి ప్ర‌భావం చూపుతుంద‌ని, దీని ద్వారా వారు త్వ‌ర‌గా కోలుకోగ‌లుగుతున్నార‌ని వెల్ల‌డించారు. ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 3341 క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, వారిలో 1300కి పైగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌పంచ వ్యాప్తంగా 40 లక్ష‌ల మందికి పైగా కోవిడ్ సోక‌గా, భార‌త్‌లో క‌రోనా కేసుల సంఖ్య 60 వేల‌కు చేరుకుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top