ఆ 39 మంది ఏమయ్యారో?! | 39 Indian workers unknown | Sakshi
Sakshi News home page

ఆ 39 మంది ఏమయ్యారో?!

Sep 17 2017 2:39 PM | Updated on Sep 19 2017 4:41 PM

ఆ 39 మంది ఏమయ్యారో?!

ఆ 39 మంది ఏమయ్యారో?!

మూడేళ్ల కిందట మోసుల్‌లో అపహరణకు గురైన 39 మంది భారతీయుల ఆచూకీ ఇంత వరకూ తెలియలేదని ఇరాక్‌ ప్రధాని హైదర్‌ ఆల్‌ అబాదీ తెలిపారు.

బాగ్దాద్‌ : మూడేళ్ల కిందట మోసుల్‌లో అపహరణకు గురైన 39 మంది భారతీయుల ఆచూకీ ఇంత వరకూ తెలియలేదని ఇరాక్‌ ప్రధాని హైదర్‌ ఆల్‌ అబాదీ తెలిపారు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు అపహరించిన 39 మంది భారతీయుల ఆచూకీ తెలుసుకునేందుకు ఇరాక్‌ సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆదివారం చెప్పారు. మూడేళ్ల కిందట అపహరణకు గురైన 39 మంది జీవించి ఉన్నారా? లేదా అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. అయితే వాళ్లు ప్రాణాలతో ఉండాలని మాత్రం భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

గత వారంలో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌.. 39 మంది కార్మికులను క్షేమంగా విడిపించాలని తనను కోరినట్లు ఆయన చెప్పారు. ఇస్లామిక్‌ స్టేట్‌ నుంచి మోసుల్‌ను స్వాధీనం చేసుకున్న క్షణం నుంచి 39 భారతీయుల ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement