కోల్డ్‌ స్టోరేజీలో అమ్మోనియా గ్యాస్‌ లీక్‌ | 33 students hospitalized after gas leakage | Sakshi
Sakshi News home page

కోల్డ్‌ స్టోరేజీలో అమ్మోనియా గ్యాస్‌ లీక్‌

Aug 23 2017 4:20 PM | Updated on Nov 9 2018 4:44 PM

అమ్మోనియా గ్యాస్‌ లీక్‌ కావడంతో 33 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

- 33 మంది విద్యార్థులకు అస్వస్థత
 
మధ్యప్రదేశ్‌: అమ్మోనియా గ్యాస్‌ లీక్‌ కావడంతో 33 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో బుధవారం వెలుగుచూసింది. స్థానిక భరతి ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న కోల్డ్‌స్టోరేజ్‌ నుంచి అమ్మోనియా గ్యాస్‌ లీకవడంతో.. 33 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ప్రత్యేక అంబులెన్స్‌ల సాయంతో ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement