
పరవాడ: అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం చోటు చేసుకుంది. లూపిన్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్మికుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
కాగా,ప్రమాదంలో లూపిన్ ఫార్మా యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం తెల్లవారు జామున 4.00గంటలకు ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచింది. ప్రమాదంలో అస్వస్థతకు గురైన వారిలో సాయి షిఫ్ట్ ఇంచార్జ్, గణేష్ కెమిస్ట్, రాఘవేంద్ర, నాయుడులను షీలా నగర్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో నలుగురు చికిత్స పొందుతున్నారు. మిగిలిన ఇద్దరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.