ప‌సికందుకు త‌ల్లి ప్రేమ‌ను దూరం చేసిన క‌రోనా | 30 Year Old Woman Dies of Coronavirus Week after Giving Birth | Sakshi
Sakshi News home page

బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన వారంలోపే క‌రోనాతో మృతి

Jun 6 2020 6:57 PM | Updated on Jun 6 2020 7:16 PM

30 Year Old Woman  Dies of Coronavirus Week after Giving Birth - Sakshi

ఔరంగాబాద్ :  క‌రోనా వైర‌స్..బంధాల‌ను, బంధుత్వాల‌ను దూరం చేస్తుంది.  30 ఏళ్ల మ‌హిళ పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన కొన్ని రోజుల్లోనే క‌రోనాతో మృత్యువాత ప‌డింది. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ర్ట‌లోని ఔరంగాబాద్‌లో చోటుచేసుకుంది. వివ‌రాల ప్ర‌కారం..మే 28న మూత్ర‌పిండాల స‌మ‌స్య‌తో గ‌ర్భిణీ న‌గ‌రంలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చేరింది. అదే రోజున ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. మ‌రుస‌టి రోజున నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయ్యింది. అప్ప‌టికే తీవ్ర ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు తోడు క‌రోనా కూడా సోక‌డంతో ప‌రిస్థితి విష‌మించి మ‌ర‌ణించిన‌ట్లు ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అయితే చిన్నారికి మాత్రం వైర‌స్ సోక‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు ఔరంగాబాద్‌లో క‌రోనా కేసుల సంఖ్య 1,834కు పెర‌గ‌గా, గ‌త 24 గంట్లోనే 65 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. (టిక్‌టాక్‌ స్టార్ ‌పై కేసు నమోదు )

Advertisement
 
Advertisement
Advertisement