'మంత్రిగా ఈ విషయం చెప్పేందుకు ఇబ్బందవుతోంది' | 30% Of Licenses In India Bogus: nitin gadkari | Sakshi
Sakshi News home page

'మంత్రిగా ఈ విషయం ఇబ్బందవుతోంది'

Jan 11 2017 4:58 PM | Updated on Apr 3 2019 5:51 PM

'మంత్రిగా ఈ విషయం చెప్పేందుకు ఇబ్బందవుతోంది' - Sakshi

'మంత్రిగా ఈ విషయం చెప్పేందుకు ఇబ్బందవుతోంది'

దేశంలో 30శాతం డ్రైవింగ్‌ లైసెన్సులు బోగస్‌వేనని బీజేపీ నేత, కేంద్ర ఉపరితల రవాణాశాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు.

న్యూఢిల్లీ: దేశంలో 30శాతం డ్రైవింగ్‌ లైసెన్సులు బోగస్‌వేనని బీజేపీ నేత, కేంద్ర ఉపరితల రవాణాశాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. ఒక మంత్రిగా ఈ విషయాన్ని చెప్పడానికి తనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించేవారిని, ఆ చర్యలను పసిగట్టేందుకు ఇక నుంచి ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రోడ్డు భద్రతా ప్రమాణాల విషయంలో చాలా అంతరాలు ఉన్నాయని, ఇబ్బందులను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.

రోడ్ల నమూనాలను మార్చాలని, అది ఒక బాధ్యతగా చేపట్టాలని కోరారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించని వారి విషయంలో కఠినంగా వ్యవహరించేలా నిబంధనలు మార్చే ఆలోచన చేస్తోందని గడ్కరీ పరోక్షంగా చెప్పారు. ప్రస్తుం రవాణా వ్యవస్థలో ఉపయోగిస్తున్న కంప్యూటర్లను ఆధునీకరించాలని, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం ఉన్న మోటారు వాహన చట్టంలో సవరణ బిల్లును జనవరి 27న జరిఏ సమావేశం తర్వాత కేబినెట్‌ వద్దకు తీసుకెళతానని స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement