దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీ సీల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతోందని ‘ఆసియాన్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఏసీహెచ్‌ఆర్)’ స్వచ్ఛంద సంస్థ పేర్కొంది.
న్యూఢిల్లీ: దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీ సీల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతోందని ‘ఆసియాన్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఏసీహెచ్‌ఆర్)’ స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన వర్గాలకు కేటాయిం చిన 27,488 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించిం ది. సెంట్రల్ యూనివర్సిటీల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ‘దేశంలో లక్ష్యానికి దూరంగా సమ్మిళిత వృద్ధి-ప్రభుత్వ విభాగాలు, ఉద్యోగాల్లో గిరిజన రిజర్వేషన్ల అమలు నిరాకరణపై పరిశోధన’ పేరిట ఏసీహెచ్‌ఆర్ ఓ నివేదికను విడుదల చేసింది.
2013 మే 8 నాటికి ఎస్టీలకు కేటాయించిన 12,195 పోస్టులు, 8,332 ఓబీసీల పోస్టు లు, 6,961 ఎస్సీ పోస్టులు ఖాళీ గా ఉన్నట్లు తెలిపింది. ఈ సంస్థ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. సెంట్రల్ వర్సి టీల్లో ఎస్టీలకు కేటాయించిన 1,187 ప్రొఫెసర్ పోస్టుల్లో 2006-07 నాటికి కేవలం 46 పోస్టులనే భర్తీ చేశారు. అదే 2010-11లో మొత్తం 1,667 పోస్టులను భర్తీ చేయగా అందులో ఎస్టీలు నలుగురే. 2010-11 నాటికి వర్సిటీల్లో మొత్తం 3,155 రీడర్ ఉద్యోగులు ఉండగా.. అందులో ఎస్టీలు కేవలం 10 మందే. దీన్ని బట్టి చూస్తే వర్సిటీల్లో ఇంకా కులతత్వం పోలేదనిపిస్తోందని సంస్థడెరైక్టర్ సుహాస్ చక్మా పేర్కొన్నారు.