ఢిల్లీలో న్యాయ విద్యార్థి కాల్చివేత | 24-year-old law student shot dead near Delhi’s Burari after argument | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో న్యాయ విద్యార్థి కాల్చివేత

Nov 12 2017 3:33 AM | Updated on Oct 2 2018 2:30 PM

24-year-old law student shot dead near Delhi’s Burari after argument - Sakshi

న్యూఢిల్లీ: మాటామాటా పెరగటంతో ఓ న్యాయ విద్యార్థిని సెక్యూరిటీ గార్డు కాల్చిచంపిన ఘటన ఢిల్లీలో జరిగింది. బిహార్‌లోని పశ్చిమ చంపారన్‌ జిల్లాకు చెందిన ఆశిష్‌ భరద్వాజ్‌(24) గురుగ్రామ్‌లోని బంధువుల ఇంట్లో ఉంటూ అక్కడే ఓ ప్రైవేటు వర్సిటీలో న్యాయ విద్య అభ్యసిస్తున్నారు. తన స్నేహితులు హిమాన్షు, అనూప్‌లను కలుసుకునేందుకు గురువారం ఢిల్లీ చేరుకున్న భరద్వాజ్‌ వారితో కలిసి హర్‌దేవ్‌నగర్‌కు బయలుదేరారు.

రాత్రి 11.45 సమయంలో మద్యం తాగి బైక్‌పై వెళ్తున్న ఓ సెక్యూరిటీ గార్డు వీరిని గుర్తించాడు. ఇంత రాత్రి వేళ ఇక్కడేం పని, వెళ్లిపోండని బెదిరించాడు. ఇందుకు ముగ్గురు స్నేహితులు నిరాకరించడంతో వారి మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కోపంతో ఊగిపోయిన సదరు సెక్యూరిటీ గార్డు తనవెంట తెచ్చుకున్న డబుల్‌ బ్యారెల్‌ తుపాకీతో ఆశిష్‌పై కాల్పులు జరిపాడు. బుల్లెట్‌ మెడ భాగంలో దూసుకుపోవడంతో తీవ్రంగా గాయపడిన ఆశిష్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement