breaking news
security guard attack
-
ఢిల్లీలో న్యాయ విద్యార్థి కాల్చివేత
న్యూఢిల్లీ: మాటామాటా పెరగటంతో ఓ న్యాయ విద్యార్థిని సెక్యూరిటీ గార్డు కాల్చిచంపిన ఘటన ఢిల్లీలో జరిగింది. బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన ఆశిష్ భరద్వాజ్(24) గురుగ్రామ్‌లోని బంధువుల ఇంట్లో ఉంటూ అక్కడే ఓ ప్రైవేటు వర్సిటీలో న్యాయ విద్య అభ్యసిస్తున్నారు. తన స్నేహితులు హిమాన్షు, అనూప్‌లను కలుసుకునేందుకు గురువారం ఢిల్లీ చేరుకున్న భరద్వాజ్ వారితో కలిసి హర్‌దేవ్‌నగర్‌కు బయలుదేరారు. రాత్రి 11.45 సమయంలో మద్యం తాగి బైక్‌పై వెళ్తున్న ఓ సెక్యూరిటీ గార్డు వీరిని గుర్తించాడు. ఇంత రాత్రి వేళ ఇక్కడేం పని, వెళ్లిపోండని బెదిరించాడు. ఇందుకు ముగ్గురు స్నేహితులు నిరాకరించడంతో వారి మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కోపంతో ఊగిపోయిన సదరు సెక్యూరిటీ గార్డు తనవెంట తెచ్చుకున్న డబుల్ బ్యారెల్ తుపాకీతో ఆశిష్‌పై కాల్పులు జరిపాడు. బుల్లెట్ మెడ భాగంలో దూసుకుపోవడంతో తీవ్రంగా గాయపడిన ఆశిష్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. -
తిరుమలలో భక్తురాలిపై వాకీటాకీతో దాడి
-
తిరుమలలో భక్తురాలిపై వాకీటాకీతో దాడి
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులపై సెక్యూరిటీ సిబ్బంది జులుం ప్రదర్శించారు. లిప్తపాటు కూడా శ్రీవారిని దర్శించుకోకముందే బలవంతంగా ఇవతలకు లాగి పారేసే వ్యవహారం ఎప్పటినుంచో సాగుతోంది. ఎక్కువ మంది భక్తులకు దర్శనభాగ్యం కల్పించే పేరుతో ఇలా లాగేస్తున్నా ఇంతకాలం భక్తులు మాట్లాడకుండా సహించారు. అయితే బుధవారం నాడు ఇది మరింత పెచ్చుమీరింది. కడపకు చెందిన లక్ష్మీదేవి అనే మహిళపై ఓ సెక్యూరిటీ గార్డు వాకీటాకీతో దాడి చేశాడు. దీంతో ఆమె గాయపడ్డారు. బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె బంధువులు కూడా ఈ సంఘటన పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 'సాక్షి' ఎదుట తన ఆవేదనను ఆమె, బంధువులు వెళ్లగక్కారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని ఓవైపు టీటీడీ చైర్మన్, ఇతరులు చెబుతున్నా.. మరోవైపు మాత్రం ఇలాంటి సంఘటనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.