తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులపై సెక్యూరిటీ సిబ్బంది జులుం ప్రదర్శించారు. కడపకు చెందిన లక్ష్మీదేవి అనే మహిళపై ఓ సెక్యూరిటీ గార్డు వాకీటాకీతో దాడి చేశాడు.
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులపై సెక్యూరిటీ సిబ్బంది జులుం ప్రదర్శించారు. లిప్తపాటు కూడా శ్రీవారిని దర్శించుకోకముందే బలవంతంగా ఇవతలకు లాగి పారేసే వ్యవహారం ఎప్పటినుంచో సాగుతోంది. ఎక్కువ మంది భక్తులకు దర్శనభాగ్యం కల్పించే పేరుతో ఇలా లాగేస్తున్నా ఇంతకాలం భక్తులు మాట్లాడకుండా సహించారు. అయితే బుధవారం నాడు ఇది మరింత పెచ్చుమీరింది.
కడపకు చెందిన లక్ష్మీదేవి అనే మహిళపై ఓ సెక్యూరిటీ గార్డు వాకీటాకీతో దాడి చేశాడు. దీంతో ఆమె గాయపడ్డారు. బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె బంధువులు కూడా ఈ సంఘటన పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 'సాక్షి' ఎదుట తన ఆవేదనను ఆమె, బంధువులు వెళ్లగక్కారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని ఓవైపు టీటీడీ చైర్మన్, ఇతరులు చెబుతున్నా.. మరోవైపు మాత్రం ఇలాంటి సంఘటనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.