200 నాటు బాంబులు స్వాధీనం | 200 country bombs seized | Sakshi
Sakshi News home page

200 నాటు బాంబులు స్వాధీనం

Nov 29 2015 6:24 PM | Updated on Aug 20 2018 4:27 PM

200 నాటు బాంబులు స్వాధీనం - Sakshi

200 నాటు బాంబులు స్వాధీనం

తమిళనాడు పోలీసులు భారీ మొత్తంలో బాంబులు స్వాధీనం చేసుకున్నారు.

తిరునెల్వెలి: తమిళనాడు పోలీసులు భారీ మొత్తంలో బాంబులు స్వాధీనం చేసుకున్నారు. తిరునెల్వెలి జిల్లాలోని కోస్తా తీర ప్రాంతమైన కూతన్ కుజి గ్రామంలో 200 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.

సముద్ర తీరంలోని ఇసుకలో వాటిని పాతిపెట్టి ఉంచగా పోలీసులు గుర్తించారు. ఈ బాంబులను చేపల వేటకు వెళ్లే సమయంలో ఉపయోగించడంతోపాటు మత్యకారుల మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడు కూడా వాటిని విరివిగా ఉపయోగించి ప్రాణనష్టం కూడా కలిగాస్తారని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement