
ఇంటికొచ్చిన 15 అడుగుల భారీ సర్పం
ఒడిశాలోని సిమిలిపల్ పులుల సంరక్షణ కేంద్ర పరిధిలోని గ్రామంలో ఓ ఇంట్లో 15 అడుగుల భారీ కింగ్ కోబ్రాను గుర్తించారు.
బరిపడా(ఒడిశా): ఒడిశాలోని సిమిలిపల్ పులుల సంరక్షణ కేంద్ర పరిధిలోని గ్రామంలో ఓ ఇంట్లో 15 అడుగుల భారీ కింగ్ కోబ్రాను గుర్తించారు. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో బరిపడాలో చాలా అరుదుగా కనిపించిన ఈ సర్పాన్ని రక్షించడానికి అధికారులు ప్రత్యేకంగా పాములు పట్టేవాల్లని పిలిపించారు. పాములు పట్టడంలో నైపుణ్యం ఉన్న కృష్ణ చంద్ర ఆ పామును సురక్షితంగా అడవిలో వదిలాడు. తాను చాలా పాములు పట్టానని కానీ, ఇలాంటివి మాత్రం కేవలం ఐదు సర్పాలనే పట్టినట్టు తెలిపాడు.