బర్త్‌డే ట్రీట్‌ | Zero trailer to be unveiled on 2 November, Shah Rukh Khan's birthday | Sakshi
Sakshi News home page

బర్త్‌డే ట్రీట్‌

Aug 25 2018 4:59 AM | Updated on Aug 25 2018 4:59 AM

Zero trailer to be unveiled on 2 November, Shah Rukh Khan's birthday - Sakshi

షారుక్‌ ఖాన్‌

షారుక్‌ ఖాన్‌ తన బర్త్‌డే సందర్భంగా సినిమా అభిమానులందరికీ మంచి ట్రీట్‌ ప్లాన్‌ చేశారు. తన లేటెస్ట్‌ మూవీ ‘జీరో’ సినిమా ట్రైలర్‌ను ఆయన బర్త్‌డే నవంబర్‌ 2న రిలీజ్‌ చేయనున్నారట. షారుక్‌ ఖాన్‌ హీరోగా ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జీరో’. ఇందులో షారుక్‌ మరుగుజ్జు పాత్రలో కనిపించనున్నారు. అనుష్కా శర్మ, కత్రినా కైఫ్‌ హీరోయిన్లుగా నటించారు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన రెండు టీజర్స్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. టైటిల్‌ అనౌన్స్‌మెంట్, ఈద్‌ సందర్భంగా రిలీజ్‌ చేసిన ఈ టీజర్స్‌ సినిమాపై మంచి అంచనాలను ఏర్పరచాయి. ‘జీరో’ సినిమా  డిసెంబర్‌ 2న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement