మారీశన్‌గా విజయ్? | Young director Simbudevan Vijay directed by marishna film | Sakshi
Sakshi News home page

మారీశన్‌గా విజయ్?

Oct 11 2014 1:58 AM | Updated on Apr 3 2019 8:57 PM

మారీశన్‌గా విజయ్? - Sakshi

మారీశన్‌గా విజయ్?

అసంఖ్యాక అభిమానులను కలిగిన నటుడు విజయ్. ఇటీవల ఈయన తుపాకీ, కత్తి చిత్రాలతో అభిమానులను అలరించే ప్రయత్నం చేశారు. ఈ దీపావళికి కత్తిలా తెరపైకి రానున్నారు.

అసంఖ్యాక అభిమానులను కలిగిన నటుడు విజయ్. ఇటీవల ఈయన తుపాకీ, కత్తి చిత్రాలతో అభిమానులను అలరించే ప్రయత్నం చేశారు. ఈ దీపావళికి కత్తిలా తెరపైకి రానున్నారు. తాజాగా మారీశన్‌గా మారడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఎస్.విజయ్ తదుపరి చిత్రం మారీశన్ అనే పేరు పరిశీలనలో ఉంది. వడవేలును హీరోగా చేసి హింసై అరసన్ 23ఆమ్ పులికేసి చిత్రాన్ని తెరకెక్కించి విజయం సాధించిన యువ దర్శకుడు శింబుదేవన్ విజయ్‌ను డెరైక్ట్ చేయనున్న చిత్రం మారీశన్. క్రేజి ముద్దుగుమ్మలు హన్సిక, శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించనున్నారు.

ఎవర్‌గ్రీన్ బ్యూటీ శ్రీదేవి, కన్నడ నటుడు సుదీప్ ప్రధాన పాత్రలు పోషించనునన్నారు. ఈ చిత్రం ఫాంటసీ కథాంశంతో తెరకెక్కనుంది. ఈ కథను మొదట ధనుష్‌తో చేయూలని అనుకున్నట్టు ప్రచారం జరిగింది. తర్వాత ఏమైందోగాని మారీశన్‌గా విజయ్ మారుతున్నారు. దీన్ని ఆయన వద్ద చాలా ఏళ్లుగా పీఆర్‌వోగా పనిచేస్తున్న పి.టి.సెల్వకుమార్ నిర్మించనున్నారు.

ఛాయాగ్రహణను నటరాజన్ అందించనున్నారు. దీన్ని సరస్సులు, పర్వతాలు, అందమైన పూతోటలు అంటూ అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని సుందరమైన ప్రాంతాల్లో మారీశన్‌ను రూపొందించనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement