సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘యాత్ర’

Yatra Movie Censored With Clean U Certificate With No Cuts - Sakshi

మాలీవుడ్ మెగాస్టార్‌ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న బయోగ్రాఫికల్‌ మూవీ యాత్ర. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాకు మహి వీ రాఘవ్‌ దర్శకుడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 8న రిలీజ్‌కు రెడీ అవుతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.

నిజ జీవిత సంఘటలన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఎలాంటి కట్స్‌ లేకుండా క్లీన్‌ ‘యు’ సర్టిఫికేట్‌ను జారీ చేశారు సెన్సార్‌ బోర్డ్ సభ్యులు. ఈ సినిమాలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి తండ్రి రాజా రెడ్డి పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. సుహాసిని, అనసూయ, రావూ రమేష్‌, పోసాని కృష్ణమురళి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్‌ చిల్లా, దేవిరెడ్డి శశి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top