జైలు నుంచి 'బిగ్ బాస్' హౌజ్ కు సంజయ్ దత్.. | Would love to see Sanjay Duty in 'Bigg Boss' house: Salman Khan | Sakshi
Sakshi News home page

జైలు నుంచి 'బిగ్ బాస్' హౌజ్ కు సంజయ్ దత్..

Sep 17 2014 10:19 PM | Updated on Sep 2 2017 1:32 PM

జైలు నుంచి 'బిగ్ బాస్' హౌజ్ కు సంజయ్ దత్..

జైలు నుంచి 'బిగ్ బాస్' హౌజ్ కు సంజయ్ దత్..

జైలులో కాకుండా బిగ్ బాస్ హౌజ్ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను బంధిస్తే బాగుంటుందని...

ముంబై:  ఎర్రవాడ జైలులో కాకుండా బిగ్ బాస్ హౌజ్ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను బంధిస్తే బాగుంటుందని కండలవీరుడు సల్మాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 21 తేదిన ప్రారంభమయ్యే 'బిగ్ బాస్' ఎనిమిదవ భాగానికి సల్మాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఎర్రవాడ జైలులో ఉన్న సంజయ్ దత్ ను బిగ్ బాస్ హౌజ్ లోకి బదిలీ చేస్తే బాగుంటుందని సల్మాన్ వ్యాఖ్యలు చేశారు. ఎవరి జీవితాన్ని తెరపై చూడాలనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ఎర్రవాడ జైలులోని సంజయ్ దత్ జీవితాన్ని చూడాలని ఉంది అని అన్నారు. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ ఎర్రవాడ జైలులో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement