నాన్‌స్టాప్‌ లవ్‌ జర్నీ | Will Samantha Become Husband's 'Preyasi'? | Sakshi
Sakshi News home page

నాన్‌స్టాప్‌ లవ్‌ జర్నీ

Mar 9 2018 1:34 AM | Updated on Mar 9 2018 1:34 AM

Will Samantha Become Husband's 'Preyasi'?  - Sakshi

నాగచైతన్య, సమంత

దిల్‌ అంతా ఫుల్‌ ఖుషీతో ఎగై్జట్‌ అవుతున్నారు సమంత. మరి.. భర్తతో సినిమా అంటే ఆ మాత్రం ఎగై్జట్‌మెంట్‌ ఉంటుంది కదా. ఉమెన్స్‌ డే రోజున అనౌన్స్‌మెంట్‌ రావడం, అందులోనూ పెళ్లైన తర్వాత నాగచైతన్యతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నందుకు ఫుల్‌ హ్యాపీగా ఫీలవుతున్నారామె. నాగచైతన్య, సమంత జంటగా ‘నిన్ను కోరి’ ఫేమ్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్‌ స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఓ చిత్రం నిర్మించనున్నారు. ఈ సినిమాకు ‘ప్రేయసి’ అనే టైటిల్‌ అనుకుంటున్నారట.

‘‘సన్‌షైన్‌ పిక్చర్స్‌ పతాకంపై శివ దర్శకత్వంలో నా నెక్ట్స్‌ సినిమా రూపొందనుందని చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంది. నా బెటరాఫ్‌ సమంతతో నటించబోతున్నాను. మరో లవ్‌ జర్నీ స్టార్ట్‌’’ అని పేర్కొన్నారు నాగచైతన్య. ‘‘రోలింగ్‌ గ్లోరీ. ఎగై్జటెడ్‌.. ఎగై్జటెడ్‌.. ఎగై్జటెడ్‌. మూవీ విత్‌ హస్బెండ్‌’’ అన్నారు సమంత. ‘‘ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది’’ అని నిర్మాతలు తెలిపారు. పెళ్లికి ముందు ‘ఏమాయ చేసావె, ‘ఆటోనగర్‌ సూర్య, మనం’ చిత్రాలు చేసిన చై–సామ్‌ పెళ్లి తర్వాత సైన్‌ చేసిన ఫస్ట్‌ సినిమా ఇదే.

Advertisement
 
Advertisement
Advertisement