భారత క్రికెట్‌ కోచ్‌ను కలిసిన అఖిల్‌ | when Akhil meets India fielding coach in bangalore | Sakshi
Sakshi News home page

భారత క్రికెట్‌ కోచ్‌ను కలిసిన అఖిల్‌

Mar 8 2017 12:02 PM | Updated on Sep 5 2017 5:33 AM

భారత క్రికెట్‌ కోచ్‌ను కలిసిన అఖిల్‌

భారత క్రికెట్‌ కోచ్‌ను కలిసిన అఖిల్‌

భారత క్రికెట్‌ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ను నటుడు అక్కినేని అఖిల్‌ కలిశాడు.

బెంగుళూరు: భారత క్రికెట్‌ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ను నటుడు అక్కినేని అఖిల్‌ కలిశాడు. బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అఖిల్‌.. అనుకోకుండా భారత జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ను కలిసినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. అఖిల్‌ తనను కలిసిన విషయాన్ని శ్రీధర్‌ కూడా అభిమానులతో పంచుకున్నారు. 
 
ఈ సమయంలో అఖిల్‌, శ్రీధర్‌లు కలిసిదిగిన ఫోటో ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ అవుతోంది. ఆస్ట్రేలియాతో భారత్‌ టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్న నేపధ్యంలో భవిష్యత్తులో జరగబోయే మ్యాచ్‌లలో విజయాలు సాధించాలని ట్విట్టర్‌ వేదికగా ఆకాంక్షించాడు అఖిల్‌.
 
Advertisement
 
Advertisement
Advertisement