అసలేం జరిగింది? | What really happened? | Sakshi
Sakshi News home page

అసలేం జరిగింది?

May 27 2015 11:54 PM | Updated on Sep 3 2017 2:47 AM

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

రేఖ గొప్ప అందగత్తె. మంచి నటి. ఆమె ఓ పాత్ర చేశారంటే, అందులో వేరే తారను ఊహించుకోలేం. అంత అద్భుతంగా ఆ పాత్రలో ఒదిగిపోతారామె. మరి అంత అద్భుతమైన నటి అంగీకరించిన ఓ పాత్రను ఇప్పుడు టబు చేస్తున్నారు.

రేఖ గొప్ప అందగత్తె. మంచి నటి. ఆమె ఓ పాత్ర చేశారంటే, అందులో వేరే తారను ఊహించుకోలేం. అంత అద్భుతంగా ఆ పాత్రలో ఒదిగిపోతారామె. మరి అంత అద్భుతమైన నటి అంగీకరించిన ఓ పాత్రను ఇప్పుడు టబు చేస్తున్నారు. ఆ సినిమా పేరు ‘ఫితూర్’. ప్రసిద్ధ రచయిత చార్లెస్ డికెన్స్ రాసిన ‘గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్’ నవల ఆధారంగా అభిషేక్ కపూర్ ‘ఫితూర్’ చిత్రం రూపొందిస్తున్నారు. ఇందులో ‘మిస్ హవీషమ్’ అనే పాత్రకు రేఖను తీసుకున్నారు.
 
 ఆమె కొన్ని సన్నివేశాల్లో నటించారు కూడా. కాగా, ఈ చిత్రం నుంచి రేఖ తప్పుకున్నారని, ఆమె స్థానంలో టబూని తీసుకున్నారనీ వార్త వచ్చింది. టబు మంచి నటే అయినప్పటికీ రేఖను రీప్లేస్ చేయగల సత్తా ఉందా? అని హిందీ రంగంలో చెప్పుకుంటున్నారు. అసలు రేఖ ఈ చిత్రం నుంచి ఎందుకు తప్పుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది.
 
 కొన్ని సన్నివేశాలు ఆమెకు అసంతృప్తిగా అనిపించాయనీ, సినిమాలో తన లుక్ కూడా పెద్దగా బాగాలేదనీ ఆమె భావించారట. అందుకే తప్పుకున్నారని భోగట్టా. అసలింతకీ ఏం జరిగిందో ‘ఫితూర్’ బృందానికే ఎరుక.
 

Advertisement
 
Advertisement
Advertisement