breaking news
Great Expectations
-
అసలేం జరిగింది?
రేఖ గొప్ప అందగత్తె. మంచి నటి. ఆమె ఓ పాత్ర చేశారంటే, అందులో వేరే తారను ఊహించుకోలేం. అంత అద్భుతంగా ఆ పాత్రలో ఒదిగిపోతారామె. మరి అంత అద్భుతమైన నటి అంగీకరించిన ఓ పాత్రను ఇప్పుడు టబు చేస్తున్నారు. ఆ సినిమా పేరు ‘ఫితూర్’. ప్రసిద్ధ రచయిత చార్లెస్ డికెన్స్ రాసిన ‘గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్’ నవల ఆధారంగా అభిషేక్ కపూర్ ‘ఫితూర్’ చిత్రం రూపొందిస్తున్నారు. ఇందులో ‘మిస్ హవీషమ్’ అనే పాత్రకు రేఖను తీసుకున్నారు. ఆమె కొన్ని సన్నివేశాల్లో నటించారు కూడా. కాగా, ఈ చిత్రం నుంచి రేఖ తప్పుకున్నారని, ఆమె స్థానంలో టబూని తీసుకున్నారనీ వార్త వచ్చింది. టబు మంచి నటే అయినప్పటికీ రేఖను రీప్లేస్ చేయగల సత్తా ఉందా? అని హిందీ రంగంలో చెప్పుకుంటున్నారు. అసలు రేఖ ఈ చిత్రం నుంచి ఎందుకు తప్పుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది. కొన్ని సన్నివేశాలు ఆమెకు అసంతృప్తిగా అనిపించాయనీ, సినిమాలో తన లుక్ కూడా పెద్దగా బాగాలేదనీ ఆమె భావించారట. అందుకే తప్పుకున్నారని భోగట్టా. అసలింతకీ ఏం జరిగిందో ‘ఫితూర్’ బృందానికే ఎరుక. -
ఘాటైన ముద్దు...
అది శ్రీనగర్‌లోని దాల్ సరస్సు. మంచు కురుస్తున్న వేళ. ఆ సరస్సు ఒడ్డున తెల్లటి బురఖా ధరించిన ఓ యువతి తన ప్రియుడి పెదవిని గాఢంగా చుంబిస్తోంది. అంతటి చలిలో కూడా ప్రేమికుల తనువులు వేడెక్కాయి. కాలానికి కూడా హద్దులు చెరిపేశారు. కొంచెం సేపు అయ్యాక కట్....కట్...కట్... అని అరుపు. ఈ సన్నివేశం ‘ఫితూర్’ చిత్రం కోసం ఆదిత్యరాయ్‌కపూర్, కత్రినాకైఫ్‌ల మధ్య చిత్రీకరించారు. ‘కె పోచే’ ఫేమ్ అభిషేక్కపూర్ దర్శకుడు. చార్లెస్ డికెన్స్ రాసిన ‘గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కశ్మీర్లో భారీగా వరదలు వచ్చాక అక్కడ చిత్రీకరణ జరుపుకుంటున్న తొలి చిత్రం ఇదే. ఇందులో సీనియర్ నటి రేఖ కీలక పాత్ర పోషిస్తున్నారు.