షారుక్ ఖాన్ తో ఎలాంటి శతృత్వం లేదు!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తో శతృత్వం కాని, మితృత్వం కాని లేదని నటుడు అజయ్ దేవగణ్ వ్యాఖ్యానించారు.
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తో శతృత్వం కాని, మితృత్వం కాని లేదని నటుడు అజయ్ దేవగణ్ వ్యాఖ్యానించారు. మీడియానే గోరంతలు కొండంతలూ చేసి వివాదాలుగా మలుస్తోందని అజయ్ అన్నారు.
'మేమిద్దరం కేవలం సహనటులం. ఒకరిపై మరొకరికి గౌరవభావం ఉంది అని అన్నారు. షారుక్ నటించిన జబ్ తక్ హై జాన్, అజయ్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ చిత్రాలు ఒకే రోజు విడుదల కావడం బాలీవుడ్ లో కొంత వివాదమైంది. అయితే జబ్ తక్ హై జాన్ విడుదల విషయంలో షారుక్ ప్రమేయం లేదు.. ఆ చిత్రాన్ని యష్ రాజ్ సంస్థ నిర్మించింది అని అజయ్ అన్నారు. షారుక్, తనకు మధ్య ఎలాంటి విభేధాలు లేవని ఓ ప్రశ్నకు అజయ్ దేవగణ్ సమాధానమిచ్చారు.