పదిమందికి సాయపడితే... | Welcome Zindagi Teaser Launch | Sakshi
Sakshi News home page

పదిమందికి సాయపడితే...

Feb 17 2019 1:58 AM | Updated on Feb 17 2019 1:58 AM

Welcome Zindagi Teaser Launch - Sakshi

వీవీ వినాయక్, వేదాంత్, లక్ష్మణ్, శాలు

శ్రీనివాస కళ్యాణ్, ఖుష్బూ పోద్దార్‌ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం ‘వెల్‌కం జిందగీ’. శాలు–లక్ష్మణ్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం పిల్లర్‌ 9 ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందింది.  ఈ సినిమా టీజర్‌ని డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘వెల్‌కం జిందగీ’ టీజర్‌ చూశాక సినిమాలో మంచి కంటెంట్‌ ఉందనిపిస్తోంది. ఈ సినిమా బాగా ఆడాలి’’ అన్నారు.

దర్శకులు శాలు, లక్ష్మణ్‌ మాట్లాడుతూ– ‘‘మన చుట్టూ ఉన్న పదిమందికి మనం చేసే చిన్న సాయం వారి జీవితాల్లో ఎలాంటి ఆనందాన్ని, వెలుగును నింపుతుందో చెబుతూ సాయం ప్రాముఖ్యతను వివరించే చిత్రం ఇది. ఫ్యామిలీ డ్రామాతో పాటు ప్రేమకథ ఆకట్టుకుంటుంది. మధుమణి, కమల్‌ల నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. ‘జబర్దస్త్‌’ ఫేం కొమురం కామెడీ ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. శ్రీసాయి ప్రతి ఫ్రేమ్‌ను అందంగా తెరకెక్కించారు. గౌతమ్‌ రవిరామ్‌ సంగీతం చక్కగా కుదిరింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు చివరి దశలో ఉన్నాయి’’ అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement