పెళ్లికొడుకు అవుతున్న మరో హీరో | wedding bells for Hero naveen chandra | Sakshi
Sakshi News home page

పెళ్లికొడుకు అవుతున్న మరో హీరో

May 18 2015 11:56 AM | Updated on Sep 3 2017 2:17 AM

పెళ్లికొడుకు అవుతున్న మరో హీరో

పెళ్లికొడుకు అవుతున్న మరో హీరో

టాలీవుడ్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. బ్యాచులర్ హీరోలు ఓ ఇంటివారు అవుతున్నారు. మంచు మనోజ్ ఈ నెల 20న...

హైదరాబాద్ : టాలీవుడ్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. బ్యాచులర్ హీరోలు వరుసగా ఓ ఇంటివారు అవుతున్నారు. మంచు మనోజ్ ఈ నెల 20న ప్రణతి మెడలో మూడు ముళ్లు వేయబోతున్న విషయం తెలిసిందే. అలాగే హీరో అల్లరి నరేష్ కూడా మే 29న ఓ ఇంటి వాడు కాబోతున్నాడు.

తాజాగా 'అందాల రాక్షసి' ఫేమ్ నవీన్ చంద్ర కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఆ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా నవీన్ చంద్రకు మాత్రం మంచి గుర్తింపే వచ్చింది. ఇక ఇతగాడు పెద్దలు నిర్ణయించిన యువతిని పెళ్లాడనున్నాడు. వధువు హైదరాబాద్కు చెందిన యువతిగా సమాచారం. త్వరలో నిశ్చితార్థం జరగనుందని, అయితే పెళ్లి మాత్రం వచ్చే ఏడాదేనని నవీన్ చంద్ర సన్నిహితులు తెలిపారు.

కాగా అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నవీన్ చంద్ర ఓ వైపు తెలుగులో మరోవైపు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. పెళ్లి సమయానికి ఆ సినిమాలన్ని పూర్తి చేసుకోవాలనే ప్లాన్లో ఉన్నాడు. ప్రస్తుతం స్వాతి ప్రధాన పాత్ర పోషిస్తున్న'త్రిపుర' చిత్రం షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళంలో రూపొందుతోంది.ఇక తమిళ చిత్రం శివప్పుతో పాటు మరో కోలివుడ్ చిత్రానికి సైన్ చేశాడు. అంతేకాకుండా నవీన్ చంద్ర చేతిలో రెండు, మూడు తెలుగు చిత్రాలు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement