పవన్‌ కల్యాణ్పై రాం చరణ్‌ కామెంట్‌ | we invite pawan kalyan, ram charan tweets | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్పై రాం చరణ్‌ కామెంట్‌

Jan 3 2017 6:34 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్‌ కల్యాణ్పై రాం చరణ్‌ కామెంట్‌ - Sakshi

పవన్‌ కల్యాణ్పై రాం చరణ్‌ కామెంట్‌

ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్కు పవన్ కల్యాణ్‌ వస్తాడా రాడా అన్న విషయం సినీ వర్గాలు, అభిమానుల్లో ఉత్కంఠగా మారింది.

హైదరాబాద్‌: తొమ్మిదేళ్ల విరామం తరువాత మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్కు పవన్ కల్యాణ్‌ వస్తాడా రాడా అన్న విషయం సినీ వర్గాలు, అభిమానుల్లో ఉత్కంఠగా మారింది. పవన్‌ వచ్చే అవకాశం లేదని సినీ వర్గాలు చెబుతుండగా, ఆయన్ను రప్పించేందుకు మెగా ఫ్యామిలీ ప్రయత్నిస్తోంది. బాబాయ్‌ను కలసి ఇన్విటేషన్‌ ఇస్తానని రాంచరణ్‌ ఫేస్‌ బుక్‌ లైవ్‌లో చెప్పాడు. దీంతో పవన్‌ రాకకోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఈ నెల 7వ తేదీన గుంటూరులోని హాయ్లాండ్లో ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు, రాఘవేంద్రరావులు రానున్నారు. నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement