చెర్రీకీ అన్నీ ఆయన లక్షణాలే..! | Vivek Oberoi Tweet About Ram Charan | Sakshi
Sakshi News home page

Nov 3 2018 8:40 PM | Updated on Nov 3 2018 10:13 PM

Vivek Oberoi Tweet About Ram Charan - Sakshi

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ ఫిక్స్‌ అయినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీపావళికి చెర్రీ ఫస్ట్‌లుక్‌ను, టైటిల్‌ను ప్రకటించబోతున్నారనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఈ సినిమాలో చెర్రీ యుద్ధం చేయబోయేది (విలన్‌) బాలీవుడ్‌ విలక్షణ నటుడు వివేక్‌ ఒబేరాయ్‌తో అన్న సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా వివేక్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఈ చిత్రంలో తనకు సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ పూర్తైయిన సందర్భంగా ట్వీట్‌ చేస్తూ.. ‘కెమెరా ముందు యోధులం.. కెమెరా వెనక అన్నదమ్ములం.. ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించి ఇది నా చివరి రోజు.. ఇదొక ఎపిక్‌ ఎక్స్‌పీరియన్స్‌. ప్రతీ మూమెంట్‌ను ప్రేమించాను. నా బ్రదర్‌ రామ్‌చరణ్‌తో పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది. నువ్వు చూపించిన ప్రేమకు, ఇచ్చిన గౌరవానికి, ఆతిథ్యానికి ధన్యవాదాలు. లెజెండరీ అయిన మీ నాన్నకు ఉన్న గొప్ప లక్షణాలన్నీ నీకూ ఉన్నాయి’ అంటూ చెర్రీని ఉద్దేశించి ట్వీట్‌ చేశాడు. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement