జంటగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌ సందేశ్‌, వితికా షెరు | Vithika Sheru In Bigg Boss 3 Telugu | Sakshi
Sakshi News home page

జంటగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌ సందేశ్‌, వితికా షెరు

Aug 15 2019 9:01 PM | Updated on Oct 21 2019 2:57 PM

Vithika Sheru In Bigg Boss 3 Telugu - Sakshi

బిగ్‌బాస్‌లోకి ఇంతవరకు ఓ జంట వెళ్లింది లేదు. అయితే అందులోకి వెళ్లాక జంటలు ఏర్పడటం మామూలే. అయితే ఈ సారి ఓ జంట మాత్రం హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్‌లో ఒకప్పుడు ఫుల్‌ క్రేజ్‌ను సొంతం చేసుకున్న వరుణ్‌ సందేశ్‌, ఆయన సతీమణి వితికా షెరు హౌస్‌లోకి ప్రవేశించారు. మరి ఇద్దరు భార్యభర్తలు హౌస్‌లో ఎలా ఉంటారు? టాస్క్‌లు ఇచ్చినప్పుడు ఒకరిపై ఒకరు గెలవాలనుకుంటారా? లేదా ఒకరికోసం మరొకరు వదులుకుంటారా? అన్నది చూడాలి.

వితికా షెరు
జననం: 1993
స్వస్థలం: భీమవరం
తల్లిదండ్రులు:
విద్య: ఫ్యాషన్‌ డిజైనింగ్‌
వృత్తి: నటి, మోడల్‌
గుర్తింపునిచ్చింది: ప్రేమ ఇష్క్‌ కాదల్‌
ప్రయాణం: 11 సంవత్సరాలకే చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి అనతికాలంలోనే బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ చిత్రంతో సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ సక్సెస్‌ అవటంతో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోనూ నటించింది. తెలుగు నటుడు వరుణ్‌ సందేశ్‌తో సాగిన ప్రేమను పెళ్లి పీటలెక్కించింది.
నటించిన చిత్రాలు: అంతు ఇంతు ప్రీతి బంతు(కన్నడ), ప్రేమించు రోజుల్లో, సందడి, చలో, (జుమ్మంది నాదం, భీమిలి కబడ్డీ జట్టు,) పడ్డానండీ ప్రేమలో మరి
తెలియనివి: ఆర్కే గ్రాండ్‌ మాల్‌, తాస్య, భీమ జ్యువెలర్స్‌, భార్గవి ఫ్యాషన్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌. పలు కమర్షియల్‌ అడ్వర్టైజ్‌మెంట్స్‌లోనూ కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement