తమిళసీమలో.. విష్ణు ఎంట్రీ! | Vishnu entry debuted in Tamil ..! | Sakshi
Sakshi News home page

తమిళసీమలో.. విష్ణు ఎంట్రీ!

Jan 19 2017 10:50 PM | Updated on Sep 5 2017 1:37 AM

తమిళసీమలో.. విష్ణు ఎంట్రీ!

తమిళసీమలో.. విష్ణు ఎంట్రీ!

ఇప్పటి వరకూ తెలుగు చిత్రాలు మాత్రమే చేసిన మంచు విష్ణు ఇప్పుడు తమిళంపై కూడా దృష్టి పెట్టారు.

ఇప్పటి వరకూ తెలుగు చిత్రాలు మాత్రమే చేసిన మంచు విష్ణు ఇప్పుడు తమిళంపై కూడా దృష్టి పెట్టారు. ఆయన హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న చిత్రం గురువారం ప్రారంభమైంది. విష్ణు, సురభి జంటగా జి.ఎస్‌. కార్తీక్‌ దర్శకత్వంలో రమా రీల్స్‌ పతాకంపై సుధీర్‌కుమార్‌ పూదోట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సంగీత దర్శకుడు కీరవాణి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నటుడు మోహన్‌బాబు క్లాప్‌ ఇచ్చారు. రచయిత విజయేంద్రప్రసాద్‌ గౌరవ దర్శకత్వం వహించారు.

నిర్మాత మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో నిర్మించనున్న ఐదో చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తాం. ఈ చిత్రం ద్వారా విష్ణు తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఈ రోజు నుంచే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టాం. తమన్‌ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు’’ అని తెలిపారు. సంపత్‌రాజ్, పోసాని, నాజర్, ప్రగతి,బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజేష్‌ యాదవ్, లైన్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.కె.నయూమ్, సహ నిర్మాత: కిరణ్‌ తనమాల.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement