అయోగ్య వస్తున్నాడు | Vishal Temper remake Ayogya to release in Telugu | Sakshi
Sakshi News home page

అయోగ్య వస్తున్నాడు

May 26 2019 12:38 AM | Updated on May 26 2019 12:38 AM

Vishal Temper remake Ayogya to release in Telugu - Sakshi

రాశీ ఖన్నా,విశాల్‌

తమిళంలో విశాల్‌ హీరోగా నటించిన చిత్రం ‘అయోగ్య’. వెంకట్‌ మోహన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా కథానాయికగా నటించారు. ‘ఠాగూర్‌’ మధు నిర్మించారు. తెలుగు హిట్‌ ‘టెంపర్‌’కు ‘అయోగ్య’ తమిళ రీమేక్‌. కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభించిందని చిత్రబృందం పేర్కొంది. దీంతో ‘సినిమాను అదే టైటిల్‌తో నిర్మాత మల్కాపురం శివకుమార్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు.

‘‘ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూన్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. విశాల్‌ నటన హైలైట్‌గా ఉంటుంది. తమిళ ప్రేక్షకులకు నచ్చిన ‘అయోగ్య’ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత. పార్థిబన్, సంతాన భారతి, ఎం.ఎస్‌. భాస్కర్, యోగిబాబు, ఆనంద్‌ రాజ్, సోనియా అగర్వాల్‌ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు సామ్‌ సి.ఎస్‌ సంగీతం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement