‘అయోగ్య’ టీజర్‌ రెడీ..! | Vishal Ayogya Teaser Release Date | Sakshi
Sakshi News home page

‘అయోగ్య’ టీజర్‌ రెడీ..!

Feb 5 2019 10:24 AM | Updated on Feb 5 2019 1:38 PM

Vishal Ayogya Teaser Release Date - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందిన సూపర్‌ హిట్ సినిమా టెంపర్‌. ఎన్టీఆర్‌లోని నటుడిని సరికొత్తగా ఆవిష్కరించిన ఈ సినిమా ఇతర భాషల్లోనూ రీమేక్‌ అయ్యింది. ఇప్పటికే సింబాగా బాలీవుడ్‌లో సత్తా చాటిన టెంపర్‌, త్వరలో  కోలీవుడ్‌లోనూ సందడి చేసేందుకు రెడీ అవుతోంది. కోలీవుడ్‌లో మంచి ఫాంలో ఉన్న విశాల్‌ ఈ రీమేక్‌లో హీరోగా నటిస్తున్నాడు.

వెంకట్‌ మోహన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అయోగ్య అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ప్రస్తుతం నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా టీజర్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు చిత్రయూనిట్. ఫిబ్రవరి 6న టీజర్‌ రిలీజ్‌ అవుతుందని ప్రకటించారు. లైట్‌ హౌస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement