అభిమన్యుడు వచ్చేస్తున్నాడు..! | Vishal Abhimanyudu Release Date Confirmed | Sakshi
Sakshi News home page

Apr 28 2018 12:22 PM | Updated on Apr 28 2018 12:22 PM

Vishal Abhimanyudu Release Date Confirmed - Sakshi

కోలీవుడ్ స్టార్‌ విశాల్‌ హీరోగా తెరకెక్కిన సినిమా అభిమాన్యుడు. చాలా రోజుల క్రితమే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా తమిళనాట సమ్మె కారణంగా వాయిదా పడింది. అయితే సమ్మె పూర్తయిన వెంటనే సినిమా రిలీజ్‌ చేయాలని భావించినా ఇతర సినిమాలు లైన్‌ లో ఉండటంతో వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్‌గా అభిమన్యుడు రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేశారు చిత్రయూనిట్‌.

పలు వాయిదాల తరువాత ఈ సినిమాను మే 11న రిలీజ్‌ చేసేందుకు నిర్ణయించారు. అదే రోజు మరో రెండు సినిమాలు రిలీజ్‌ అయ్యేందుకు రెడీ అయినా విశాల్‌ ఆ చిత్ర నిర్మాతలను ఒప్పించి తన సినిమా రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌ చేశాడు. విశాల్‌ సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు పీఎస్‌ మిత్రన్‌ దర్శకుడు.

Advertisement
 
Advertisement
Advertisement