జయగారు డబ్బులొచ్చే సినిమాలే తీశారు! | Vinayak was released by Harish and Avanthika 'Vishakham' publicity teaser. | Sakshi
Sakshi News home page

జయగారు డబ్బులొచ్చే సినిమాలే తీశారు!

Jun 6 2017 12:18 AM | Updated on Sep 5 2017 12:53 PM

జయగారు డబ్బులొచ్చే సినిమాలే తీశారు!

జయగారు డబ్బులొచ్చే సినిమాలే తీశారు!

‘‘జయగారి సినిమాల్లో హిట్, యావరేజ్‌ సినిమాలున్నాయి. అయితే, వాటి వల్ల ఎవరికీ ఒక్క రూపాయి నష్టం రాలేదు.

– వీవీ వినాయక్‌
‘‘జయగారి సినిమాల్లో హిట్, యావరేజ్‌ సినిమాలున్నాయి. అయితే, వాటి వల్ల ఎవరికీ ఒక్క రూపాయి నష్టం రాలేదు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు... అందరికీ డబ్బులొచ్చే సినిమాలే తీశారు’’ అని దర్శకుడు వీవీ వినాయక్‌ అన్నారు. హరీశ్, అవంతిక జంటగా బి. జయ దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ పబ్లిసిటీ టీజర్‌ను వినాయక్‌ విడుదల చేశారు. అలాగే, ఇటీవల విడుదలైన థీమ్‌ టీజర్‌ 2.5 మిలియన్‌ వ్యూస్‌ సాధించిన సందర్భంగా కేక్‌ కట్‌ చేసి, చిత్ర బృందాన్ని అభినందించారు.

వీవీ వినాయక్‌ మాట్లాడుతూ – ‘‘మహిళా దర్శకురాలు ఎనిమిది సినిమాలు తీయడమంటే తమాషా కాదు. విజయ నిర్మలగారి తర్వాత తెలుగులో ఎక్కువ సినిమాలు తీసిన ఘనత జయగారిదే. ‘వైశాఖం’ ట్రైలర్, పాటలు బాగున్నాయి. జయగారు తీసిన సినిమాల్లో ‘లవ్‌లీ’ పెద్ద హిట్‌. ఈ సినిమా అంత కంటే పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నా. మంచి డేట్, థియేటర్లు లభించిన తర్వాత సినిమాను విడుదల చేయమని సలహా ఇస్తున్నా’’ అన్నారు. ‘‘వినాయక్‌గారు ఎంతో మంచి మనిషి. ఆయన ఈ వేడుకకు రావడం మా అదృష్టం. ప్రేక్షకులు మెచ్చేలా ‘వైశాఖం’ ఉంటుంది’’ అన్నారు బి. జయ. నిర్మాత బీఏ రాజు, హీరో హరీశ్, సంగీత దర్శకుడు డీజే వసంత్, నటుడు పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement