ఫీల్‌ గుడ్‌ మూవీ

Vinara Sodara Veera Kumara Movie Trailer Launch - Sakshi

శ్రీనివాస్‌ సాయి, ప్రియాంక జైన్‌ జంటగా సతీష్‌చంద్ర నాదెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినరా సోదరా వీరకుమార’. లక్ష్మీస్‌ సినీ విజన్స్‌ బ్యానర్‌పై లక్ష్మణ్‌ క్యాదారి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నెల క్రితమే ఈ చిత్రం ట్రైలర్‌ను చూశాను. చాలా బావుంది. ఇదొక ఫీల్‌ గుడ్‌ మూవీ. ఎన్నో ఎమోషన్స్‌ ఉన్న చిత్రమిది’’ అన్నారు. ‘‘ఇందులో నాది చాలా మంచి పాత్ర. మొదటిసారి హీరో ఫాదర్‌ క్యారెక్టర్‌ చేశాను’’ అన్నారు నటుడు ఉత్తేజ్‌.

సతీష్‌ నాదెళ్ల మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్‌ అవ్వాలని ఎన్నో ఏళ్లుగా ట్రై చేస్తున్నాను. నాకీ అవకాశం ఇచ్చిన లక్ష్మణ్‌గారికి కృతజ్ఞతలు. ఇది చాలా జెన్యూన్‌గా రాసిన కథ. ఈ చిత్రం మొత్తాన్ని కాకినాడలో 50 రోజుల సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేశాం’’ అన్నారు. ‘‘మా సినిమాని అన్ని  వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు లక్ష్మణ్‌ క్యాదారి. కెమెరామెన్‌ రవి.వి, మాటల రచయిత లక్ష్మీభూపతి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అనిల్‌ మైలాపుర్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top