రెగ్యులర్‌ మూవీ కాదు! | Vinara Sodara Veera Kumara Movie Success Meet | Sakshi
Sakshi News home page

రెగ్యులర్‌ మూవీ కాదు!

Mar 25 2019 12:06 AM | Updated on Mar 25 2019 12:06 AM

Vinara Sodara Veera Kumara Movie Success Meet - Sakshi

శ్రీనివాస్, ప్రియాంక

శ్రీనివాస్‌ సాయి, ప్రియాంకా జైన్‌ జంటగా నాదెళ్ల సతీష్‌ చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వినరాసోదర వీరకుమార’. లక్ష్మణ్‌ క్యాదారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో సాయిశ్రీనివాస్‌ మాట్లాడుతూ–‘‘చాలా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ముఖ్యంగా మా సినిమా సెకండాఫ్‌ను ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్న విధానం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.

ఈ చిత్రం ఇంకా సక్సెస్‌ కావడానికి ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు.‘‘ఇది రెగ్యులర్‌ మూవీ కాదు’ అని సినిమాను చూసిన వారందరూ బాగుందని అంటుంటే చాలా సంతోషంగా ఉంది. యూత్‌ సపోర్ట్‌ చేయాలి’’ అన్నారు సతీష్‌ చంద్ర. ‘‘సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు లక్ష్మణ్‌. ‘‘ఇండస్ట్రీ కొత్తవారిని ఎలా ప్రోత్సహిస్తుందో ప్రేక్షకులు కూడా అలాగే మా చిత్రాన్ని ఆదరించాలి’’ అన్నారు ప్రియాంక. ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్, రాజేష్, అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement