రాముడా? రావణుడా?

రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి కన్నడలో ‘ది విలన్’ సినిమా షూటింగ్‌కు కొబ్బరికాయ కొట్టి. ఇప్పుడు గుమ్మడికాయ కొట్టే టైమ్ వచ్చింది. ఆల్రెడీ టాకీపార్ట్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా టీమ్ ప్రజెంట్ సాంగ్స్‌ను షూట్ చేసే పనిలో పడింది. శివరాజ్‌కుమార్, సుదీప్, అమీజాక్సన్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘ది విలన్’. రామ్ ఆర్ రావణ్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు మిధున్ చక్రవర్తి కీలక పాత్రలు చేస్తున్నారు. రీసెంట్‌గా హీరో శివరాజ్ కుమార్‌పై ఓ మాస్ సాంగ్‌ను షూట్ చేశారు. ఈ సాంగ్‌తో ఈ సినిమాలో శివరాజ్‌కుమార్ వంతు చిత్రీకరణ పూర్తయ్యింది. ‘‘శివన్న డ్యాన్సింగ్ ఎనర్జీ సూపర్. నగేశ్ మాస్టర్ కంపోజ్ చేశారు’’ అన్నారు దర్శకుడు ప్రేమ్. ఆల్రెడీ హీరోల లుక్స్ రిలీజ్ అయ్యాయి. ఈ నెల 28న టీజర్‌ను రిలీజ్ చేయాలనుకుంటున్నారట.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి