ప్లీజ్‌... నన్ను బాధపెట్టొద్దు

the villain movie shooting sudeep reentry - Sakshi

.... అంటున్నారు కన్నడ హీరో సుదీప్‌. అసలేం జరిగిందంటే... ఈ హీరో ఫ్యాన్‌ ఒకరు చేతిపై ‘కిచ్చా’ అని పచ్చబొట్టు పొడిపించుకున్న విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సుదీప్‌.. ‘‘ఫ్యాన్స్‌ ఇలా చేస్తున్నందుకు థ్యాంక్స్‌ చెప్పాలో లేక సారీ చెప్పాలో తెలియడం లేదు. నువ్వు ఆ పచ్చబొట్టు వేయించుకుంటున్నప్పుడు ఎంత బాధ భరించి ఉంటావో నేను అర్థం చేసుకోగలను (పచ్చబొట్టు పొడిపించుకున్న అభిమానిని ఉద్దేశిస్తూ). ఇలాంటివి చేసి మీరు బాధపడొద్దు.

నన్ను బాధపెట్టొద్దు. నా సినిమా చూడడానికి ఫ్యాన్స్‌ టిక్కెట్స్‌ కొని, నన్ను సపోర్ట్‌ చేస్తే అదే చాలు. మనస్ఫూర్తిగా చెబుతున్నాను. నాపై అభిమానాన్ని చాటుకోవడానికి ఫ్యాన్స్‌ ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. అంతులేని మీ అభిమానానికి థ్యాంక్స్‌’’ అన్నారు సుదీప్‌. ఇక సినిమాల విషయానికొస్తే... ప్రేమ్‌ దర్శకత్వంలో శివరాజ్‌ కుమార్, సుదీప్, అమీ జాక్సన్‌ ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘ది విలన్‌’.

‘‘వారం రోజుల తర్వాత శుక్రవారం ‘ది విలన్‌’ సినిమా సెట్‌లోకి ఎంటర్‌ అయ్యాను’’ అన్నారు సుదీప్‌. ప్రస్తుతం సుదీప్, అమీ పాల్గొనగా ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఇందులో అమీ పాత్ర కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుందట. ఈ సంగతి ఇలా ఉంచితే అజయ్‌వర్మ దర్శకత్వంలో మోహన్‌ లాల్‌ హీరోగా రూపొందుతోన్న ‘నీరళి’ చిత్రంలో సుదీప్‌ కీ రోల్‌ చేస్తున్నారట. సుదీప్‌ కన్నడ సినిమాలు మలయాళంలో డబ్‌ అయ్యాయి. అయితే ఆయన చేయనున్న ఫస్ట్‌ స్ట్రైట్‌ మలయాళ మూవీ ఇది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top