అయినా మంచి భర్తే!

villain movie release 14 february 2018 - Sakshi

భార్య కాలికి దెబ్బతగిలి హస్పిటల్‌లో జాయిన్‌ అయితే.. ఏ భర్త అయినా చూడకుండా ఉంటాడా? పోనీ.. రెండేళ్లుగా ఇంటిని పట్టించుకోకపోవడమే కాకుండా.. ఒక్క పండగని కూడా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి చేసుకోలేకపోతే.. ఆ భర్త ‘మంచివాడు’ అవుతాడా? కాదు కదా. అయినా ఇప్పుడు చెప్పబోతున్న దర్శకుడు ప్రేమ్‌ మాత్రం మంచివాడే. భార్యను పట్టించుకునే తీరిక  అతనికి లేదు. ఫ్యామిలీతో పండగలు చేసుకునే ఖాళీ లేదు. ఎందుకలా? అంటే.. ఆయన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘ది విలన్‌’ కోసం. శివరాజ్‌ కుమార్, సుదీప్, అమీజాక్సన్‌ ముఖ్య తారలుగా ప్రేమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ది విలన్‌’. న్యూ ఇయర్‌ స్పెషల్‌గా టీజర్‌ను లాంచ్‌ చేయాలనుకున్నారు. కానీ గ్రాఫిక్స్‌ వర్క్స్‌ పెండింగ్‌ ఉండటం వల్ల వీలుపడలేదట. ఇందుకు ప్రేమ్‌∙సోషల్‌ మీడియాలో వివరణ ఇచ్చుకున్నారు.

ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు చెప్పారాయన. ‘‘బ్యాలెన్స్‌ టాకీ పార్ట్‌ను, ఫోర్‌ సాంగ్స్‌ను ఫిబ్రవరి కల్లా కంప్లీట్‌ చేయాలనుకుంటున్నాం. ఇందుకోసం ఫోర్‌ డిఫరెంట్‌ స్టూడియోస్‌లో సెట్‌ వర్క్‌ స్టార్ట్‌ చేశాం. ఏప్రిల్‌ కల్లా కంప్లీట్‌ అవుతుందని అనుకుంటున్నాం. మల్టీస్టారర్‌ సినిమా కావడంతో రెండు టీజర్స్‌ను రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అంటూ తన పర్సనల్‌ లైఫ్‌ గురించి ప్రేమ్‌ మాట్లాడుతూ– ‘‘నా భార్య రక్షిత కాలికి గాయమైనప్పుడు నేను హస్పిటల్‌కి వెళ్లలేదు. ఇంట్లో పండగ సంబరాలు జరుపుకుని రెండేళ్లయింది. ఒక్కరోజు కూడా హాలీడే తీసుకోకుండా ‘ది విలన్‌’ సినిమా కోసం వర్క్‌ చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు చెప్పండి.. ప్రేమ్‌ మంచి భర్త అంటే ఒప్పుకుంటారు కదా.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top