హీరోతో సమానంగా..! | Vikram and Ritu Varma in Dhruva Natchathiram | Sakshi
Sakshi News home page

హీరోతో సమానంగా..!

Dec 6 2017 12:56 AM | Updated on Dec 6 2017 4:29 AM

Vikram and Ritu Varma in Dhruva Natchathiram - Sakshi

‘పెళ్లి చూపులు’ సినిమాతో ప్రేక్షకుల చూపులతో పాటు సినీ ఇండస్ట్రీ వర్గాల చూపులను తనవైపు తిప్పుకున్నారు హీరోయిన్‌ రీతూ వర్మ. ఈ తెలుగు పిల్ల చేతిలో రెండు మూడు తమిళ సినిమాలున్నాయి. వాటిలో ‘కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్లై అడిత్తాల్‌’ అనే చిత్రం ఒకటి. అంటే... కళ్లూ కళ్లూ కొల్లగొడితే అని అర్థం. దేశింగ్‌ పెరియసామి దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. నవంబర్‌లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ ప్రజెంట్‌ గోవాలో జరుగుతోంది. ఈ సినిమాలో తన పాత్ర గురించి రీతూ మాట్లాడుతూ– ‘‘దర్శకుడు పెరియసామి చెప్పిన కథకు ఇంప్రెస్‌ అయ్యాను.

ఈ సినిమాలో నా పాత్ర హీరో క్యారెక్టర్‌కు సమానంగా ఉంటుంది. దుల్కర్‌ సల్మాన్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘ధృవనక్షత్రం’ సినిమాలోనూ రీతూ వర్మ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘నా క్యారెక్టర్‌కి సంబంధించి ఇంకా కొన్ని సీన్స్‌ బ్యాలెన్స్‌ ఉన్నాయి. విక్రమ్‌గారి యాక్టింగ్‌ సూపర్‌. గౌతమ్‌ మీనన్‌గారి దర్శకత్వంలో నటించాలని ప్రతి హీరోయిన్‌ కోరుకుంటుంది. ఆ అవకాశం నాకు హీరోయిన్‌ అయిన తక్కువ టైమ్‌లో రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement